హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ( MLC Padi Kaushik Reddy )మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఈటెల రాజేందర్ హత్యకు పాడి కౌశిక్ రెడ్డి కుట్ర పన్నారని, 20 కోట్లు సఫారీ ఇచ్చారని ఈటెల రాజేందర్ భార్య జమున మీడియా సమావేశం నిర్వహించి సంచలన ఆరోపణలు చేశారు.
ఇక ఈటల రాజేందర్ సైతం అంతే స్థాయిలో కౌశిక్ రెడ్డి పై విమర్శలు చేయగా, ఈ వ్యవహారంపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.అసలు ఈటెల రాజేందర్ ను హత్య చేయించాల్సిన అవసరం తనకు లేదని కౌశిక్ రెడ్డి అన్నారు.
సానుభూతి కోసం ఈటెల దంపతులు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ ( Congress, BJP, BRS )పార్టీలు ఇటీవల కాలంలో చేయించిన సర్వేల్లో హుజూరాబాద్ నుంచి తానే గెలుస్తాననే నివేదికలు రావడంతోనే ఈటెల రాజేందర్ దంపతులు ఈ తరహాలో కొత్త నాటకానికి తెర తీశారని కౌశిక్ మండిపడ్డారు.

తనను ఎదుర్కోలేకే సంపతి పాలిటిక్స్చే స్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.ఈటెల రాజేందర్ ను హత్య చేయించేందుకు 20 కోట్లు కాదు కదా 20 వేల రూపాయలు కూడా ఖర్చు చేయనని అన్నారు. ఈటల నుంచే తనకు ప్రాణహాని ఉంది అని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.2018 తనను హత్య చేయించేందుకు రాజేందర్ ప్రయత్నించారని కౌశిక్ రెడ్డి విమర్శించారు.రాజేందర్ డ్రామాలు ఆడుతున్నారని, ఈటెల రాజేందర్ దంపతులు మీడియా సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికి కేంద్రం ఆయనకు కేంద్ర భాగాలతో సెక్యూరిటీ ఇస్తున్నట్లు ప్రకటించడం డ్రామా కాదా అంటూ కౌశిక్ ప్రశ్నించారు.

అసలు ఈటల రాజేందర్ కే ఎక్కువ నేర చరిత్ర ఉందని , సాంబశివుడు( Sambashivadu ) ఆయన తమ్ముడు హత్యకు రాజేందర్ కారణమని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.అమరవీరుల స్థూపం పై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, అమరవీరుల స్థూపాన్ని కూల్చలేదని, రోడ్డు విస్తరణ కోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం మేరకు వేరే చోటకి తరలించినట్లు కౌశిక్ తెలిపారు.రాజకీయంగా ఈటెల రాజేందర్ ను కూల్చేది తానేనని కౌశిక్ అన్నారు.