నెల్లూరు కోర్టులో ఇటీవల ఫైల్స్ చోరీ అయిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా సీబీఐ అధికారులు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు.
కాగా అధికారులు చెన్నై నుంచి వచినట్లు సమాచారం.ఈ క్రమంలో సీబీఐ కొందరు పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తుంది.
అయితే, టీడీపీ నేత సోమిరెడ్డికి భారీగా ఆస్తులు ఉన్నాయని, కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి.దీనిపై స్పందించిన సోమిరెడ్డి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఈ క్రమంలో కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు ఫేక్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.ఈ కేసు కోర్టు విచారణలో ఉండగానే ఏప్రిల్ లో చోరీ జరిగింది.
గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులోకి చోరబడి విలువైన పత్రాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే కాకాణికి సంబంధించిన పత్రాలు కూడా మాయం అయినట్లు గుర్తించారు.