కాగ్ ఇచ్చిన నివేదిక అక్షర సత్యమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి దగ్గర కడితే ఇంత నష్టం వచ్చేది కాదన్నారు.
మేడిగడ్డ వద్ద ఇప్పుడు గుక్కెడు నీళ్లు కూడా లేవని తెలిపారు.రూ.38 వేల కోట్ల ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు.ప్రతి ఏటా ప్రభుత్వంపై రూ.24 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు.కేసీఆర్ కాళేశ్వరం వలన లక్ష ఎకరాలు కూడా సాగు కాలేదన్నారు.
కాళేశ్వరం ఒక గుదిబండ అని విమర్శించిన ఆయన కాళేశ్వరంకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం అవినీతిపై విచారణ ఏదని ప్రశ్నించారు.