వరల్డ్ కప్ టోర్నీలో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ముంబై వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన భారత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 భారీ స్కోర్ చేయడం జరిగింది.విరాట్ కోహ్లీ 117 పరుగులు చేసి.50 వ సెంచరీ నమోదు చేసి అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.ఈ క్రమంలో సచిన్ రికార్డులు కూడా బ్రేక్ చేయడం జరిగింది.దీంతో విరాట్ కోహ్లీపై చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా బీఆర్ఎస్ మహిళా నేత ఎమ్మెల్సీ కవిత విరాట్ కోహ్లీ నీ ట్విట్టర్ లో అభినందిస్తూ సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.“క్రికెట్ లో కోహ్లీకి తిరుగులేదు.తెలంగాణలో కేసీఆర్ కి ఎదురు లేదు” అని క్రియేట్ చేసిన పోస్టర్ షేర్ చేసిన ఆమె.”CM KCR మాదిరిగా కోహ్లీకి తిరుగులేదు.మాస్టర్లు ఫీల్డ్ లో ఉన్నపుడు మ్యాజిక్ జరుగుతుంది” అని కామెంట్ చేశారు.ఎమ్మెల్సీ కవిత షేర్ చేసిన ఈ పోస్టర్ నీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.