కొద్దీ గంటల్లో ఆమె పెళ్లి జరగనుంది.బంధువులంతా విచ్చేసారు.పెళ్లి మండపం సిద్ధంగా ఉంది.అందరూ సంతోషంగా గడుపుతున్న సమయంలో ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.దీంతో పెళ్లి మండపం అంతా ఒక్కసారిగా నిశబ్దంగా మారిపోయింది.పెళ్లి పనులతో బిజీగా ఉండాల్సిన వారంతా ఎక్కడి వారు అక్కడే ఉంది పోయారు.
పెళ్ళికి కొద్దీ గంటలు ఉందనగా పెళ్లి కూతురు మేకప్ సామాన్లు కనపడడం లేదంటూ వాటిని వెంటనే కొని తెచ్చుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి స్కూటీ మీద బయల్దేరింది.కానీ ఆమె మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు.
ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక తల్లిదండ్రులు భయపడుతున్నారు.ఇంతలోనే వారికి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
అనంతపురం జిల్లా రొద్దం గౌరాజ్ పల్లిలో గురువారం రోజు ఒక పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు కనిపించకపోవడంతో ఆ పెళ్లి కాస్తా రద్దయింది.
పెళ్లి కూతురు ఇంకా కొద్దీ గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా మేకప్ సామాన్లు కనిపించడం లేదని వెంటనే తెచుకుంటానని చెప్పి రొద్దం కు స్కూటీ మీద బయల్దేరి వెళ్ళింది.అంతే ఆ సమయంలో ఆమె కిడ్నాప్ అయ్యింది.
అయితే ఈ కిడ్నాప్ ఎవరో బయట వారు చేసింది కాదు.కుటుంబ విబేధాల కారణంగా తన సొంత బావే ఆమెను కిడ్నాప్ చేసాడు.
గ్రామం నుండి రొద్దం కు వస్తుందని తెలుసుకున్న ఆమె బావ ఆమెను బలవంతంగా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసాడు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.ఆమెను కాపాడి క్షేమంగా అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.