అవును! ఏపీ రాజకీయాల్లో ఇదే విషయంపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.ఏపీపై కేంద్రంలోని బీజేపీ అధిష్టానం పగబట్టిందా? ముఖ్యంగా సీఎం చంద్రబాబు పాలనపై ఉక్కుపాదం మోపేందుకు, ఆయన హవాను తగ్గించేందుకు ఏదైనా చేయనుందా? ఒకవేళ చేస్తే.ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? అనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.దీనికి ప్రధానంగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలే! ఆయన ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రాజకీయాలు కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా మారిపోనున్నాయని చెప్పారు.అది కూడా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక.ఈ మార్పులు తథ్యమని చెప్పారు.

ఆయన ఉండబట్టలేక చెప్పారో? వాస్తవమే చెప్పారో తెలియదు కానీ.ఆయన ఈ కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.సాక్షాత్తూ.
సీఎం చంద్రబాబే ఈ వ్యాఖ్యలపై స్పందించారు.`ఏపీ రాజకీయాలను శాసిస్తారట`- అంటూ విరుచుకుపడ్డారు.
ఇక, జీవీఎల్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే.కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలు మారతాయని అన్నారు.
అయితే, అవి ఎలా మారతాయో ఆయన చెప్పలేదు.అంతేకాదు, ఈ మార్పులకు అనుగుణంగా అన్ని పార్టీలూ సిద్ధంగా ఉండాలన్నారు.
గత కొద్ది నెలలుగా ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రచారం చేసుకుంటోందని… దానిని తిప్పి కొట్టి, ప్రజా కోర్టులో నిలబెడతామని హెచ్చరించారు.
ఆయన అలా వ్యాఖ్యానించిన రెండు రోజుల్లోనే తాజాగా ఏపీకి బీజేపీ అధ్యక్షుడి కాస్త నోరున్న, రాజకీయ అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ.
బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఇక, ఈ నిర్ణయం వెలువడిని క్షణాల వ్యవధిలోనే కన్నా స్పందిస్తూ.కేంద్రం ఏపీకి చేసిన సాయాన్ని ఆధారాలతో సహా ప్రజల్లోకి తీసుకు వెళ్తానని చెప్పారు.పరిశ్రమలు, వ్యవసాయం, గృహ నిర్మాణం… ఇలా ఏ రంగంలో చూసినా కేంద్రం చేసిన సహాయం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడిందని చెప్పారు.
కేంద్రం చేస్తున్న సహాయాన్ని చెప్పకుండా… అంతా తన ఖాతాలో వేసుకోవడం సిగ్గులేనితనమని జీవీఎల్ అన్నారు.ఇక, ఈ తరహా యుద్ధమే జరుగుతుందా? లేక జీవీఎల్ వ్యాఖ్యల ను బట్టి.తమిళనాడు తరహా కక్ష పూరిత రాజకీయాలకు చోటు ఉంటుందా? అనేది తేలాల్సి ఉంటుంది.
‘‘టీడీపీ అహంకారం, తప్పుడు నిర్ణయాల వల్ల బీజేపీకి నష్టం రాదు.
ప్రభుత్వం అంటే కేవలం ప్రచారం కాదు.ఇలాంటివి చేస్తే 2004లో ఎదురైన పరిస్థితులు 2019లో ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అన్న జీవీఎల్ వ్యాఖ్యలను బట్టి బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
అయితే, రాజకీయంగా కీలక నాయకులకు అవకాశం ఇవ్వడం ద్వారా చంద్రబాబు పైనా, ఆయన పాలనపైనా యుద్ధం సాగేలా మాత్రం వ్యూహం సిద్ధం చేయొచ్చని చెబుతున్నారు.ఇప్పటికైతే.
బీజేపీలో అధ్యక్ష ఎంపిక జరిగింది.ఇక, బాబుపై యుద్ధం చేయాలంటే.
ముందుగా కన్నా ఎంపికపై పెల్లుబుకిన అసంతృప్తిని బీజేపీ అధిష్టానం తట్టుకుని నిలబడాలి.మరి ఏం జరుగుతుందో చూడాలి.