రజినీకాంత్ పై బి‌జే‌పి ఒత్తిడి ?

తమిళనాడులో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.అక్కడ ఉన్న అన్నీ పార్టీలు తమ తమ భవిష్యత్తు కార్యాచరణలో బిజీగా ఉన్నాయి.

 Is Bjp Blackmail Rajinikanth, Narendra Modi, Bjp, Amith Shah, Tamilnadu By Polls-TeluguStop.com

జాతీయ పార్టీ అయిన బి‌జే‌పి దక్షిణాది రాజకీయాలపై బాగా ఫోకస్ చేస్తుంది.ఇప్పటికే కర్నాటకలో అధికారం చేజిక్కించుకున్న బి‌జే‌పి.

తమిళనాడు రాజకీయాల్లోనూ పాగా వెయ్యాలని చూస్తుంది.అందుకు ముందుగా సినీనటుడు రజినీకాంత్ తో సంప్రదింపులు జరిపింది.

వచ్చే ఎన్నికల్లో బి‌జే‌పి కి సఫోర్ట్ చెయ్యాలని కోరినట్లుగా సమాచారం.ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ వారికి రాలేదు.ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటన చేశాడు.అభిమానులు సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చాడు.

రజినికొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనుకుంటున్న తరుణంలో ఆయన అనారోగ్యంనకు గురికావడం.రజినీకాంత్ కుటుంబ సభ్యులనుండి రాజకీయాలకు దూరంగా ఉండాలని ఒత్తిడి.

కొత్తగా ఆరోగ్యసమస్యలు తెచ్చుకోవద్దని ఆయన ఇద్దరు కుమార్తెలు బాగా ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తుంది.కానీ అసలు విషయం ఏమిటి అంటే కుటుంబ సభ్యులు మాత్రమే కాదు బి‌జే‌పి నేతల నుండి కూడా రజినీకాంత్ పై బాగా ఒత్తిడి తెచ్చారని వార్తలు వస్తున్నాయి.

Telugu Narendra Modi, Rajinikanth, Tamilandu-Political

బి‌జే‌పి మాత్రం మొదటి నుండి రజినీకాంత్ రాజకీయ పార్టీకి అడ్డు తగులుతూనే ఉంది.ప్రదని నరేంద్ర మోడి రజినీకాంత్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం.రజినీకాంత్ కూడా ఆద్యాత్మిక రాజకీయాలంటూ ప్రకటన చెయ్యడంతో అంతా ఆలోచనలో పడ్డారు.ఒక్కవెల రజిని పార్టీ పెట్టిన బి‌జే‌పి తో కలిసి పనిచేస్తారని బాగా ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో రజిని అనారోగ్యానికి గురికావడం వెంటనే పార్టీ పెట్టలేను, ప్రజా సేవ మాత్రమే చేస్తాను అంటూ ప్రకటన చెయ్యడం వెనుక బి‌జే‌పి హస్తం ఉంటుందని అనుమానాలు మొదలయ్యాయి. సూపర్ స్టార్ ను రాజకీయాల్లోకి రానివ్వకుండా చెయ్యడంలో బి‌జే‌పి సక్సెస్ అయిందనే చెప్పాలి.

ఇక బి‌జే‌పి నేతలు మాత్రం వచ్చే ఎన్నికలో రజినీకాంత్ సఫోర్ట్ మాకే ఉంటుందని ప్రచారం చేసుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube