ఏ తల్లితండ్రులు అయినాగానీ తన పిల్లలను చదివించి ఒక గొప్ప ప్రయోజకుడిని చేయాలనీ ఆశపడుతూ ఉంటారు.కొడుకులు ఉన్నత స్థానంలో ఉన్నా, కోట్ల రూపాయిలు ఉన్నాగాని ఆ డబ్బులు కోసం కానీ, గొప్పలు కోసం గాని ఎదురు చూడరు.
పిల్లలు బాగుంటే చాలు అని ప్రతి తల్లి తండ్రులు ఆశిస్తారు.బిడ్డలు ఎక్కడున్నా గాని తల్లితండ్రుల అశీస్సులు ఎప్పుడు బిడ్డలపై ఉంటూనే ఉంటుంది.
కొడుకు ఉన్నత స్థాయిలో ఉన్నాడని తెలిసినగాని తల్లిదండ్రులు మాత్రం సాధారణ జీవితం గడపడానికే అలవాటు పడిపోతారు.ఆ జీవితాన్నే ఇష్టపడుతుంటారు.
అలాగే వాళ్ళు తరతరాలుగా చేస్తున్న వృత్తిని అలానే కొనసాగిస్తుంటారు.తమ పిల్లలు ఆ వృత్తిని చిన్నతనంగా భావించి వదిలేసినా వాళ్ళు మాత్రం ఎంత కష్టం వచ్చినా దానిని వదిలిపెట్టరు.
కొడుకు కేంద్ర మంత్రి అయినాగానీ ఆయన తల్లి తండ్రులు మాత్రం సాధారణ జీవితం గడుపుతుతూ వంశపారంపర్యంగా వస్తున్న వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమ్మ, నాన్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరా అనుకుంటున్నారా.? ఇంతకాలం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన మురుగన్ తాజాగా జరిగిన మంత్రివర్గ కూర్పులో కేంద్ర మంత్రి పదవి పొందారు.కొడుకు కేంద్ర మంత్రి అయినా తల్లిదండ్రులు లోగనాథన్, వరుదమ్మాల్ వ్యవసాయం చేయడం మాత్రం మానలేదు.పేద కుటుంబంలో జన్మించిన మురుగన్ ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి న్యాయవాదిగా అనేక కేసులు వాదించి విజయం సాధించారు.
అలా మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు.

తన తల్లితండ్రుల లాగానే మురుగన్ కూడా ఖాళీ దొరికినప్పుడు తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేస్తూ పార్టీ పనులు చూసుకునే వారు.ఇలా కేంద్రమంత్రి తల్లిదండ్రులై ఉండి డాబు, దర్పం లేకుండా పొలం పనులు చేసుకుంటున్న ఈ దంపతులను చూసి అందరు నివ్వెరపోతున్నారు.మీ కొడుకు కేంద్ర మంత్రి కదా మరి మీరు ఇలా వ్యవసాయం చేయడం ఏంటి అని మీడియా వారు ప్రశ్నించగా దానికి మురుగన్ తల్లి తండ్రులు ఇలా చెప్పుకొచ్చారు.
ననా కొడుకు మురుగన్ కేంద్ర మంత్రి అయినా, మరే గొప్ప పదవిలో ఉన్నా మేమ పద్దతి మార్చుకోలేమని, మేము జీవించడానికి కష్టపడి సంపాధించుకుంటామని, ఓపిక ఉన్నంత కాలం ఒకరి మీద ఆధారపడకుండా పొలం పనులు చేస్తామని లోగనాథన్, వరదమ్మాల్ దంపతులు అంటున్నారు.