రేపు ఎన్నికల ఫలితాలు( Elections Results ) వెలువడనున్నాయి.దేశవ్యాప్తంగా ఏడు దశలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి.
దీంతో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే ఏపీలో మే 13వ తారీకు పోలింగ్ జరగటం తెలిసిందే.
దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.పరిస్థితి ఇలా ఉండగా రేపు కౌంటింగ్ నేపథ్యంలో వైఎస్ జగన్( YS Jagan ) సోషల్ మీడియాలో కార్యకర్తలను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.“ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు.
రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ… ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను”…పోస్ట్ చేయడం జరిగింది.2024 ఎన్నికలను( 2024 Elections ) వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.175 కి 175 గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు.ఈ క్రమంలో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వైసీపీ పార్టీ( YCP Party ) మంత్రులను ఎమ్మెల్యేలను నిత్యం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు.ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను సర్వేల ద్వారా తెలుసుకొని పక్కన పెట్టి మిగతా వారికి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించారు.
ఎన్నికల ప్రచారం చివరిలో బస్సు యాత్ర ఇంకా రకరకాల కార్యక్రమాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు.తన ఐదేళ్ల పాలన నచ్చితేనే ఓటేయండి అని ప్రసంగాలు చేశారు.పోలింగ్ అనంతరం 2019 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు.ఏపీ ఎగ్జిట్ పోల్స్ లో చాలా ప్రముఖ సంస్థలు సైతం వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఫలితాలు వెల్లడించాయి.
మరి ఏపీ ప్రజలు వైసీపీకి మరోసారి అవకాశం కల్పించారో లేదో అన్నది మరి కొద్ది గంటల్లో తెలియనుంది.