గత శనివారం విజయవాడలో సీఎం జగన్( CM Jagan ) ఎడమ కనుగొమ్మపై అగంతకులు రాయితో దాడి చేయడం తెలిసిందే.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న విచారణపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా( CP Kanthi Rana ) మీడియా సమావేశం నిర్వహించారు.విజయవాడ పర్యటనలో సీఎం జగన్ కు తగినంత భద్రత కల్పించినట్లు వెల్లడించారు.
ఈ పర్యటనలో కరెంట్ ఆఫ్ చేశారని ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి మామూలుగా ముఖ్యమంత్రి వంటి వ్యక్తి రోడ్ షోలో వాహనం పైకి ఎక్కి రూఫ్ టాప్ షో నిర్వహిస్తున్నప్పుడు వైర్లు తగలకుండా ఎక్కడైనా సరే కరెంట్ ఆఫ్ చేస్తారు.కొన్నిచోట్ల గాలి, వర్షం కారణంగా కరెంటు తీసేసారని తెలిపారు.
భద్రతా కారణాల వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని సెక్యూరిటీ ప్రోటోకాల్ లో( Security Protocol ) భాగమని స్పష్టం చేశారు.అయితే సరిగ్గా ఘటన వివేకానంద స్కూల్… గంగానమ్మ గుడి మధ్య ప్రాంతం నుండి ఒక వ్యక్తి రాయి విసిరారన్న నిర్ధారణకు తామోచ్చినట్లు తెలిపారు.ఈ క్రమంలో ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లు… బస్సు యాత్రలో పాల్గొన్న సెల్ ఫోన్ విజువల్స్.మొత్తం పరిశీలిస్తున్నాం.ఈ కేసులో దాదాపు 50 నుంచి 60 మంది అనుమానితులను విచారించటం జరిగింది.సీఎం జగన్ నుదిటి ఎడమ కన్నుపై తగిలిన రాయి వీడియో ఫుటేజ్.
ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది.ఈ ఘటనపై వెల్లంపల్లి గారు ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించామని కాంతిరాణా వివరించడం జరిగింది.