తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పంటల రుణమాఫీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) నేపథ్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన జాతర( Jana Jatara ) బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చే ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిక్స్ గ్యారెంటీ అమలు చేయటానికి చర్యలు చేపట్టడం జరిగింది.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తదితర పథకాలు అమలవుతున్నాయి.
ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అమలు కావడం లేదు.ఎన్నికలు ముగిసిన వెంటనే అన్ని పథకాలు అమలు అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది.
రైతుల రుణమాఫీ అంశంపై మాట్లాడుతూ…ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.ప్రస్తుతం ఎన్నికల కోడ్( Election Code ) ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని స్పష్టం చేశారు.ఎన్నికల ముగిసిన వెంటనే అన్ని పథకాలు అమలు అవుతాయి.పండించిన పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించి చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఇదే సమయంలో రాష్ట్రంలో 10 శాతం జనాభా ఉన్న ముదిరాజ్ లను గత ప్రభుత్వం విస్మరించింది.
పార్లమెంట్ ఎన్నికలలో వారికి ఒక టికెట్ కూడా కేటాయించలేదు.ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూప్ లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.