ఒక చిన్న కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బండ్ల గణేష్,( Bandla Ganesh ) అకస్మాత్తుగా నిర్మాతగా మారి, పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడం అందరినీ షాక్ కి గురి చేసిన విషయం.దీని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సినిమాల మీద విపరీతమైన ఇష్టం ఉండడం వల్లే చేసాడు కానీ, అతనికి ఒక పెద్ద కోళ్ల ఫారం ఉందని, తెలంగాణ లో అది నెంబర్ 1 స్థానం లో ఉందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా కెరీర్ ని ప్రారంభించిన బండ్ల గణేష్, ‘గబ్బర్ సింగ్’( Gabbar Singh ) చిత్రం తో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ నిర్మాతలలో ఒకడిగా నిలిచాడు.ప్రస్తుతం రాజకీయాల్లోకి ( Politics ) అడుగుపెట్టిన బండ్ల గణేష్ పూటకో పార్టీ కి భజన చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
![Telugu Bandla Ganesh, Chandrababu, Congress, Pawan Kalyan, Revanth Reddy-Telugu Telugu Bandla Ganesh, Chandrababu, Congress, Pawan Kalyan, Revanth Reddy-Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/11/bandla-ganesh-supporting-to-which-party-tdp-or-congress-detailsa.jpg)
పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) భక్తుడిగా ఈయన ఇచ్చే ప్రసంగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే పవన్ కళ్యాణ్ ప్రసంగం కంటే ఎక్కువగా బండ్ల గణేష్ ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యాన్స్.ఈ భజన కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే పరిమితం చేస్తాడు అనుకుంటే, రీసెంట్ గా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ అయిన సందర్భంగా, అతనికి సంఘీభావంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ కి బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ఇచ్చిన ప్రసంగం ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము.చంద్రబాబు నాయుడు ని దివి నుండి భువికి దిగి వచ్చిన అవతార పురుషుడి లాగ ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ ని చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు.
పోనీ అక్కడితో వదిలేసాడా అంటే అది కూడా లేదు.
![Telugu Bandla Ganesh, Chandrababu, Congress, Pawan Kalyan, Revanth Reddy-Telugu Telugu Bandla Ganesh, Chandrababu, Congress, Pawan Kalyan, Revanth Reddy-Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/11/bandla-ganesh-supporting-to-which-party-tdp-or-congress-detailss.jpg)
ఇప్పుడు తెలంగాణ ప్రాంతం లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఎన్నికలలో నా సపోర్టు కాంగ్రెస్ పార్టీ కి( Congress Party ) మాత్రమే ఉంటుందని, నా తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.జనాలు కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తి గా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆదేశాలతో, రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నేతృత్వం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని బండ్ల గణేష్ ధీమాని వ్యక్తం చేస్తున్నాడు.
అయితే ఇంతకీ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి భక్తుడా?, చంద్రబాబు నాయుడు అభిమానా?, లేదా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడా?, ఈ మూడిట్లో బండ్ల గణేష్ ఏమిటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అడుగుతున్నారు.