ఆస్ట్రేలియా: అమ్మమ్మ అస్థికలు పాస్తా సాస్‌లో కలిపింది.. ఫ్యామిలీ తినడంతో..??

ఆస్ట్రేలియాలో( Australia ) ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది.ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తన మరణించిన అమ్మమ్మ అస్థికలు( Grandmother’s Ashes ) తినేసింది.

 Australian Woman Serves Grandmothers Ashes Mixed In Pasta Sauce Details, Austral-TeluguStop.com

గత సంవత్సరం మరణించిన ఆమె అమ్మమ్మ బూడిదను ఇంట్లో ఒక సీసాలో భద్రపరిచారు.ఆ మహిళ ఆ బూడిదను తానే తినడమే కాకుండా, ఇతర కుటుంబ సభ్యులకు కూడా పంచిపెట్టింది.

ఈ సంఘటన చాలా విచిత్రంగా, వివాదాస్పదంగా మారింది.దుఃఖంలో మునిగి ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడానికి, మనసును తేలికపరచడానికి ఆమె ఈ పని చేసిందని చెబుతున్నారు.

ఆమె పేరు చెయెన్.

Telugu Australia, Australian, Brothersister, Cheyenne, Grandmother, Strange, Nri

ఆస్ట్రేలియాకు చెందిన చెయెన్( Cheyenne ) మరణించిన తన అమ్మమ్మ బూడిదను తినాలని నిర్ణయించుకుంది.అంతేకాకుండా, ఆ బూడిదను పాస్తా సాస్‌లో( Pasta Sauce ) కలిపి తన సోదరుడికి కూడా తినిపించింది.చెయెన్ దృష్టిలో ఇది ఒక సరదాగా ఉండే బ్రదర్ సిస్టర్ ప్రాంక్ మాత్రమే.ఒక లైవ్ రేడియో ఇంటర్వ్యూలో, చెయెన్ తన చర్యకు కారణం వివరించింది.“అవును, నేను తిన్నాను.కేవలం సరదాగా,” అని చెప్పింది.తన అమ్మమ్మ ఎల్లప్పుడూ తనతోనే ఉంటారని చెయెన్ నమ్ముతుంది.

Telugu Australia, Australian, Brothersister, Cheyenne, Grandmother, Strange, Nri

ఇదిలా ఉంటే 26 ఏళ్ల కాసి అనే మరో మహిళ ఒక అసాధారణ అలవాటును పెంచుకుంది.తన మరణించిన భర్త బూడిదను ఉంచిన కూజాలో వేలు ముంచి, నాకుతూ ఉంటుంది.కాసి భర్త అస్తమా దాడితో మరణించి రెండు నెలల తర్వాతే ఈ విచిత్రమైన అలవాటు బయటపడింది.ఒక రియాలిటీ టీవీ షో “మై స్ట్రాంజ్ అడిక్షన్”లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తన భర్త బూడిదను కార్డ్‌బోర్డ్ బాక్స్ నుంచి కూజాలోకి తరలించేటప్పుడే ఆమె మొదటిసారిగా ఆ బూడిదను రుచి చూసింది.అస్థికలు తినడం ఏంటో అర్థం కావడం లేదని ఈ ఘటనల గురించి తెలుసుకున్న చాలా మంది షాక్‌ను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube