ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎలక్షన్స్ లో గెలిచిన సంబరాలను సెలబ్రేట్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఆ సంబరాలను రెట్టింపు చేస్తూ ఓ జి సినిమా( OG movie ) నుంచి కూడా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ గెలుపుని భారీ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకోవడానికి ఈ పోస్ట్ ని కూడా రిలీజ్ చేశారని తెలుస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా పోస్టర్ తాలూకు పాజిటివిటీ అనేది పెరిగిపోయింది.
ఇక దాని వల్లే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన దానికి అలాగే పోస్టర్ రిలీజ్ చేసినందుకు రెండింటికి చాలా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో గెలిచాడు.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరం ఓజి సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టి పాన్ ఇండియాలో తన మార్కెట్ ని విస్తరింపచేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఎందుకంటే ఎమ్మెల్యేగా( MLA ) గెలిచిన ఆయనకు చాలా బరువు బాధ్యతలు ఉంటాయి.కాబట్టి వాటిని నిర్వర్తించడంలో ఆయన చాలా బిజీగా ఉంటాడు.

మరి దానికి సంబంధించినట్టుగానే ఖాళీ సమయం దొరికినప్పుడు సినిమాలు చేస్తూ పాలిటిక్స్ మీద ఎక్కువ సమయం కేటాయించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఈ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో కూడా మంచి విజయం సాధించడంతో జనాల్లో పవన్ కళ్యాణ్ పట్ల చాలావరకు నమ్మకమైతే పెరిగింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఇదే విధంగా తను ముందుకు కదిలితే వచ్చే సంవత్సరం మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచి సీఎం గా కూడా ఎదిగే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయంటూ మరి కొంత మంది మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
.