పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ల నియామకంపై గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా తమ ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై మండిపడింది.
ఈ క్రమంలోనే 2013 నుంచి నేటి వరకు విద్యాశాఖలో పని చేసిన అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.అనంతరం కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
కాగా ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యాలు కోర్టు ధిక్కరణ కేసు వేసిన సంగతి తెలిసిందే.