జూనియర్ ఎన్టీఆర్ ( NTR )వీరాభిమాని శ్యామ్( Shyam ) మృతి సంఘటన ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకొంటున్నది.అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన శ్యామ్ మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉరి వేసుకొన్న శ్యామ్ శరీరంపై గాయాలు ఉన్నాయి.శరీరం వేలాడుతూ పూర్తిగా నేలపైన ఉండటంతో అతడిది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
కుమారుడి మరణంతో శ్యామ్ తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇక తన అభిమాని మరణించడంతో ఎన్టీఆర్ కూడా శ్యామ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.శ్యామ్ మరణ వార్త..
తన మనసును కలచివేసిందన్నారు.ఇదే సమయంలో శ్యామ్ మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న అతని తల్లిదండ్రులకు ఎన్టీఆర్ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది.
శ్యామ్ చెల్లెలి పెళ్లి భాద్యత తమదే అని ప్రకటించింది.చనిపోయిన శ్యామ్ ను ఎలాగూ తీసుకురాలేము కానీ.
ఆ కుటుంబానికి అండగా ఉంటాం.అందుకే శ్యామ్ చెల్లి పెళ్లి బాధ్యత మాది అంటూ ప్రకటించారు.

తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Mega power star Ram Charan ) ఫ్యాన్స్ కూడా సపోర్ట్ గా నిలుస్తున్నారు.శ్యామ్ మరణంపై స్పందించిన రామ్ చరణ్ ఫ్యాన్స్.శ్యామ్ చెల్లి పెళ్లికి తాము కూడా సపోర్ట్ చేస్తాం అని ప్రకటించారు.పెళ్లి వివరాలు మాకు కూడా చెప్పండి .మేము మీతోపాటు మా వంతూ సహాయమా చేస్తాం.అందరం కలిసి చెల్లి పెళ్లి చేద్దాం అని ప్రకటించారు.
దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రశంసలు దక్కుతున్నాయి.టాలీవుడ్ హీరోలందరూ, వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పడూ ఇలాగే కలిసి ఉండాలి.
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఆపేసి ఇలాంటి మంచి పనులు చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక శ్యామ్ మరణంపై అధికార , విపక్షాలు విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి.