మాజీమంత్రి నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారుల విచారణ ముగిసింది.దాదాపు నాలుగు గంటల పాటు నారాయణను అధికారులు ప్రశ్నించారు.25 మంది సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుపై విచారించారు.
ఎవరి లబ్ది కోసం మార్పులు చేశారో, ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారనే అంశంపై నారాయణను ప్రశ్నించారు.కాగా నారాయణ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని సీఐడీ తెలిపింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణను అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.