ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు చిన్న వయస్సు నుండి పెళ్లీలు చేసుకునే వరకు కలిసిమెలసి కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తారు.కానీ పెళ్లి అయిన తర్వాత వారిలో వచ్చే మార్పులను కన్నవారు కూడా కనిపెట్టలేరు.
ఇదెక్కడి విచిత్రమో.చిన్నప్పుడు చిన్న దెబ్బ తాకితే తట్టుకోలేని అన్నదమ్ములు పెరిగినాక మాత్రం చంపుకోవడానికి కూడా వెనకాడరు.
మరి వారిలో అప్పటివరకు ఉన్న ఆ ప్రేమలు ఆస్తుల వల్ల మరుగున పడిపోతున్నాయా.
ఇకపోతే శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన యాదయ్య (50), అతని తమ్ముళ్లు పాండు, శ్రీనివాస్ మధ్య గత కొంతకాలంగా భూవివాదం కొనసాగుతోందట.
కాగా ఈరోజు కూడా వీరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో కోపోద్రిక్తులైన పాండు, శ్రీనివాస్ వీరి అన్నపై కత్తితో దాడి చేయగా, అతను అక్కడికక్కడే మృతి చెందాడట.
కాగా హత్య అనంతరం నిందితులిద్దరూ శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారట.
ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారట.ఇకపోతే భూ వివాదంతో సొంత అన్ననే తమ్ముళ్లు హత్య చేయడం టంగుటూరు గ్రామంలో సంచలనంగా మారింది.
ఇక ఈ సంఘటనలో పూర్తిగా బంధాలకంటే ఆస్తులే గొప్పవని వారు భావించినట్లు అర్ధం అవుతుంది.