వైసీపీపై అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ నేతల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి.ఎందుకంటే ప్రతి ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ దిశా పలితాలు సాధిస్తుండటమే ఇందుకు కారణం.
గత సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచి మొదలైన ఈ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే అన్ని ఎన్నికల్లోనూ దుమ్ములేపుతోంది వైసీపీ.
అయితే ఇప్పుడు టీడీపీ కొన్ని చోట్ల వైసీపీకి షాక్ ఇస్తోంది.టీడీపీకి ఇవి చిన్న విజయాలే అయినా వైసీపీకి మాత్రం పెద్ద నష్టం అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ముఖ్యంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగన్ అనుకున్నట్టుగానే చాలా చోట్ల విజయం సాధించినా కీలక మైన నియోజకవర్గంలో పట్టు కోల్పోయారు.ఇది కాస్తా అమరావతి రైతుల ప్రభావం ఉన్న నియోజకవర్గం కావడంతో మూడు రాజధానుల అంశం బెడిసికొడుతున్నట్టు కనిపిస్తోంది.
మొన్న జరిగిన 12 మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు, క్రిష్ణా, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ హవా కనిపించింది.ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గానికి చెందిన రిజల్ట్ వైసీపీకి పెద్ద షాక్ ఇస్తోంది.
వీటితో పాటే జగ్గయ్యపేట, కొండపల్లి లాంటి చోట కూడా టీడీపీ గట్టి పోటీ నిచ్చింది.

బొటా బొటి మెజార్టీతోనే ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చింది.ఇక తాడికొండ నియోజకవర్గం కూడా టీడీపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టింది.అయితే ఈ ఏరియాల్లో అమరావతి రైతుల మహా పాదయాత్ర ఎఫెక్ట్ బాగా తగిలిందని చెబుతున్నారు.వారు ఇప్పుడు మహాపాదయాత్రతో ఇక్కడ రైతులు పర్యటించడం వైసీపీకి వ్యతిరేక పవనాలు వీచేలా చేసింది.
దీంతో జగన్‌కు రాబోయే రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ఎఫెక్ట్ తగిలే ప్రమాదం ఉందని చెబుతున్నారు.అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో జగన్ కు క్లిష్ట పరిస్థితులు తప్పవని చెబుతున్నారు.
.