బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ లో గత కొన్ని వారాల నుంచి ఊహించని విధంగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఎలిమినేషన్ తరువాత అమ్మ రాజశేఖర్ తన కెప్టెన్సీని మెహబూబ్ కు అప్పగించాడు.
బిగ్ బాస్ హౌస్ లో విలన్ ఎవరని నాగార్జున అడగగా అభిజిత్ విలన్ అని చెప్పారు.అనంతరం బిగ్ బాస్ బజ్ లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ హౌస్ లోని కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న అభిజిత్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.అభిజిత్ వేస్ట్ అని అతను హౌస్ లో ఉండటానికి అర్హుడు కాదని తెలిపారు.
తాను బిగ్ బాస్ హౌస్ లో ఉంటే తన వల్ల షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుందని.అభిజిత్ వల్ల ఏమీ రాదని చెప్పారు.బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య అనేక సందర్భాల్లో గొడవలు జరిగాయి.హౌస్ లో ఒకరిపై మరొకరికి సదభిప్రాయం లేదు.
అందువల్లే అమ్మ రాజశేఖర్ అభిజిత్ వేస్ట్ అంటూ కామెంట్లు చేసి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు.అమ్మ రాజశేఖర్ ఆరోగ్య సమస్యల వల్ల ఎలిమినేట్ అయిన నోయల్ ఫేక్ అని.అరియానా ఏ విషయం గురించి పాజిటివ్ గా ఆలోచించదని.హారిక మంచి అమ్మాయి అని ఎవరు ఇంగ్లీష్ బాగా మాట్లాడితే వాళ్లతో క్లోజ్ గా ఉంటుందని చెప్పారు.
లాస్య పైకి ఒకలా లోపల మరోలా ఉంటుందని అవినాష్ లైఫే కామెడీ అని చెప్పారు.
మరోవైపు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నామినేషన్లు లీక్ అయ్యాయి.
అభిజిత్, హారిక, లాస్య, సొహైల్, అరియానా నామినేషన్లలో ఉన్నారని తెలుస్తోంది.అభిజిత్, హారిక, లాస్య సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సొహైల్, అరియానాలలో ఎవరో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.