అసలు ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో బీజేపీ బలమైన పునాదులు వేసుకుంటోంది.తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకుంటాము అనే ధీమా అప్పుడే బీజేపీ నాయకుల్లో కనిపిస్తోంది.
అందుకే రెట్టించిన ఉత్సాహంతో బీజేపీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ బలంగా పుంజుకుంటోంది అనే సంకేతాలు రావడం, గెలుపు తమవైపే ఉంటుందని ఆ పార్టీ నాయకులు నమ్ముతుండడం,
తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్
పై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు, ఆ పార్టీలో కీలకమైన నాయకులు ఇప్పుడు తమ వైపు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండటం , వంటి వ్యవహారాలను బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.
ఇక గ్రేటర్ ఎన్నికల ఫలితాలలో బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని నమ్ముతోంది.
టిఆర్ఎస్ కు ప్రజా వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనం అవుతుండడం, రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలతో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండటం వంటి కారణాలతో బీజేపీ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే పెద్దఎత్తున కాంగ్రెస్ కు చెందిన కీలకమైన ప్రజాప్రతినిధులు అందరిని బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి త్వరలోనే బీజేపీ లోకి వస్తారని, ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు.
అలాగే కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ సైతం బీజేపీ లోకి వచ్చి ఎందుకు మంతనలు చేస్తున్నారట.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్దకు కాంగ్రెస్ నాయకులు కడుతున్నారని, బీజేపీ లోకి వస్తే తమకు ఎటువంటి ప్రాధాన్యం ఇస్తారు అనే విషయంపై చర్చిస్తున్నారని, మరికొందరు వచ్చే ఎన్నికల్లో సీటు హామీ పొందుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అలాగే టిఆర్ఎస్ కు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, బీజేపీ వైపు చూస్తూ ఉండడం ఆ పార్టీలో కీలక నేత ఒకరు రేపోమాపో బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉండటం , ఇప్పటికే ఆయనకు మేయర్ ఆఫర్ కూడా ఇవ్వడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే ఈ చేరికల తంతు ముగించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చూస్తున్నారు .ఈ క్రమంలోనే ఎక్కువ ఫోకస్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టినట్టుగా కనిపిస్తున్నారు.