తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఓ నిందితుడు జైలు నుంచి విడుదల అయ్యారు.కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతికి బెయిల్ రావడంతో ఆయన హైదరాబాద్ లోని చంచల్ గూడ్ జైలు నుంచి బయటకు వచ్చారు.
దాదాపు 45 రోజుల తర్వాత రామచంద్ర భారతి బెయిల్ పై విడుదలైయ్యారు.ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిన్న విడుదలైయ్యారు.
కానీ వెంటనే మరో కేసులో ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో నిన్న రాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రామచంద్రభారతి విడుదలైయ్యారు.
కాగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో రామచంద్ర భారతి ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.