సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే వీడియోలలో కనీసం పది వీడియోలు కోతులకు(Monkeys) సంబంధించినవే ఉంటాయి అని చెప్పకోవడంలో అతిశయోక్తి లేదు.అవును, కోతులకు సంబందించిన ఫుటేజ్ జనాలకు చాలా నవ్వుని తెప్పిస్తుంటుంది.
అందుకే చాలామంది జనాలు వాటికి సంబందించిన వీడియోలను నిత్యం తిలకిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కోతులకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవి పోట్లాడుకొని ఏకంగా రైళ్ల రాకపోకలనే నిలిపివేశాయంటే మీరు నమ్మితీరాల్సిందే.
అవును, బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో (Samastipur railway station in Bihar_చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెటిజన్లను తెగ కవ్విస్తోంది.ఇక్కడ రెండు కోతులు మధ్య దాదాపుగా గంటపాటు గొడవ జరగడంతో రైళ్ల రాకపోకలు కూడా ఆ సమయంలో నిలిచిపోవడం గమనార్హం.విషయం ఏమిటంటే… ఫ్లాట్‌ఫారమ్ నెంబర్ 4 సమీపంలో అరటిపండు కోసం రెండు కోతులు గొడవ పడడం ఇక్కడ చూడవచ్చు.
వాటిలో ఒకటి రబ్బర్ లాంటి వస్తువును మరొకదానిపైకి విసరగా విసిరిన వస్తువు రైల్వే ఓవర్ హెడ్ వైర్‌కి తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయింది.దీంతో తీగలు తెగి రైలు బోగీల పడటంతో రైళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇంకేముంది, కట్ చేస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రైన్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి.ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లోని ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ వైర్లకు మరమ్మతులు చేపట్టింది.కాగా ఈ కారణంగా ప్లాట్‌ఫారమ్ 4పై ఉన్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ దాదాపుగా 15 నిమిషాలు ఆలస్యంగా పయనించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అంతేకాకుండా ఇతర రైళ్లు కూడా ఆలస్యం కావడంతో ప్రయాణికులు గంటకు పైగా ఆ స్టేషన్లో వేచిచూడాల్సి వచ్చింది.
దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.ఇకపోతే, ఇటీవల కాలంలో ఇటువంటి కోతి సమస్యలు ఎక్కువ కావడంతో.
మరీ ముఖ్యంగా సమస్తిపూర్ రైల్వేస్టేషన్‌లో కోతుల బెడద ఎక్కువ కావడంతో, అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకొనే పనిలో పడినట్టు ఇండియన్ రైల్వే తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.