ఆన్‌లైన్‌లో లక్షల్లో, కోట్లలో డబ్బులు సంపాదించవచ్చని చాలామంది ప్రూవ్ చేశారు.చాయ్ వాలా, మొమోలు అమ్మేవాళ్లు కూడా ఎక్కువ ఇన్‌కమ్స్‌తో హాట్ టాపిక్ గా మారుతున్నారు.
చదువుకుని ఉద్యోగం చేసినా 50,000 లేదా 60,000 సంపాదించడం చాలా కష్టమైపోతోంది కానీ కొందరు చదువు మధ్యలో వదిలేసి కొంతమంది బాగా సంపాదిస్తున్నారు.ఈ వార్తలు చూసినప్పుడు, చదువు అంత అవసరం లేదనిపించవచ్చు.
అలాంటి వారిలో ఒకరు అమీ లాండినో.( Amy Landino ) ఆమె 15 ఏళ్ల క్రితం చదువు మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది.అప్పుడు ఆమెకు 50,000 డాలర్లు అప్పు ఉంది.అయినా ఆమె తన నిర్ణయం భవిష్యత్తుకు మంచిదని భావించింది.ఆమె స్నేహితులు ఉద్యోగాలు( Jobs ) వెతుక్కోవడానికి కష్టపడుతుండగా, ఆమె మాత్రం వీడియోలు చేసి నెలకు 18,000 డాలర్లు (రూ.15 లక్షల రూపాయలు) సంపాదిస్తుంది.
![Telugu Amy Landino, Dropout Story, Entrepreneur, Passive, Youtube-Latest News - Telugu Amy Landino, Dropout Story, Entrepreneur, Passive, Youtube-Latest News -](https://telugustop.com/wp-content/uploads/2024/11/YouTube-Creator-Amy-Landino-on-How-She-Makes-Money-detailsd.jpg)
చదువు పూర్తి చేయడానికి మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అమీ లాండినో తన చదువును ఆపివేసి, ప్రభుత్వ విధానాల సహాయకురాలిగా పని చేయడానికి నిర్ణయించుకుంది.అలా పని చేస్తుండగా, వీడియోలు చేసి యూట్యూబ్( Youtube ) లాంటి ప్లాట్‌ఫామ్‌లలో పెట్టడం ప్రారంభించింది.“నా వీడియోలను ఉచితంగా అప్‌లోడ్ చేయగలిగే ఒక సైట్ దొరికింది అని తెలిసి నేను చాలా సంతోషించాను” అని ఆమె చెప్పింది.
ఆమె స్నేహితుడు ఆమె వీడియోలు ప్రొఫెషనల్‌గా క్రియేట్ చేయవచ్చని సూచించాడు.
అది ఆమె జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.అలానే చిన్న చిన్న వ్యాపారాలకు సోషల్ మీడియాను నిర్వహించే పనిని ఆమె సైడ్ జాబ్‌గా( Side Job ) చేసుకోవడం మొదలుపెట్టింది.
రోజు మొత్తం ఉద్యోగం చేస్తూనే, రాత్రులు, వారాంతాల్లో తన ఏజెన్సీని పెంచుకోవడానికి కష్టపడింది.
![Telugu Amy Landino, Dropout Story, Entrepreneur, Passive, Youtube-Latest News - Telugu Amy Landino, Dropout Story, Entrepreneur, Passive, Youtube-Latest News -](https://telugustop.com/wp-content/uploads/2024/11/YouTube-Creator-Amy-Landino-on-How-She-Makes-Money-detailsa.jpg)
2010లో అమీ లాండినో తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి తన ఉద్యోగాన్ని వదిలివేసింది.ఆమె తన వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలను( Vide Editing Skills ) మెరుగుపరచుకోవడం, సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి కంటెంట్ సృష్టించడంపై దృష్టి సారించింది.తన యూట్యూబ్ ఛానెల్ అమీ టీవీలో వీడియోలను అప్‌లోడ్ చేసేటప్పుడు ఆనందంగా అనిపించింది అవి ప్రేక్షకులకు ఉపయోగపడటంతో మరింత కృషి అయ్యింది అంతే కాదు వాటి ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చని తెలుసుకుంది.
ఆమె వ్లాగ్ లైక్ ఏ బాస్ , గుడ్ మార్నింగ్, గుడ్ లైఫ్ వంటి పుస్తకాలను కూడా ప్రచురించింది, 2017 నుంచి సుమారు 40,000 కాపీలు అమ్ముడయ్యాయి.ఇప్పుడు, 39 ఏళ్ల వయసులో, ఆమె యూట్యూబ్ యాడ్స్, అఫిలియేట్ సేల్స్, బ్రాండ్ డీల్స్, ప్రొడక్ట్ సేల్స్ నుంచి నెలకు సుమారు 18,000 డాలర్లు సంపాదిస్తుంది.
ఆమె స్టోరీ అందరికీ ఇన్‌స్పిరేషనల్ గా నిలుస్తోంది.