సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన చిత్రం పుష్ప 2.( Pushpa 2 ) గతంలో విడుదల అయిన పుష్పా పార్ట్1 సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ఈ మూవీ ఉంది.
అలాగే ఇండియాలోనే అత్యధిక థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ వ్యాపారం జరిగిన మూవీగా కూడా రికార్డు సృష్టించింది.పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో బన్నీ నెక్స్ట్ సినిమా ఉండబోతోంది.
కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.నిర్మాత నాగ వంశీ( Producer Nagavamshi ) కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేసారు.
కచ్చితంగా ఈ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండబోతోందని చెప్పారు.సరికొత్త ప్రపంచాన్ని ఈ మూవీ కోసం త్రివిక్రమ్ క్రియేట్ చేశారని అన్నారు.
పుష్ప 2 రిలీజ్ తర్వాత బన్నీ ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది పాన్ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రం ఉండబోతోంది.కాగా ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.కాగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
మైథిలాజికల్ ఎలిమెంట్స్ తో పాటు, భారీ క్యాస్టింగ్ కోసం ఈ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది.విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ సినిమాలో ఎక్కువగా ఉండబోతోందని సమాచారం.బన్నీ కెరీర్ లో ఇప్పటి వరకు టచ్ చేయని క్యారెక్టరైజేషన్ ఈ సినిమా కోసం త్రివిక్రమ్ డిజైన్ చేశారట.అలాగే ఒక స్టార్ హీరోయిన్ ని ఈ మూవీలో లీడ్ రోల్ కోసం ఎంపిక చేయబోతున్నట్లు టాక్.