భారతీయ పాటకు దీపావళి వేళ అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టిన అమెరికన్ అంబాసిడర్

దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా దీపావళి పండుగను( Diwali Festival ) జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.ప్రతి వీధి వీధినా క్రాకర్స్ శబ్దాలు దద్దరిల్లుతున్నాయి.

 Us Ambassador Eric Garcetti Dances To Tauba Tauba During Diwali Celebrations Vid-TeluguStop.com

ఈ సమయంలో తాజాగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి( US Ambassador Eric Garcetti ) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.దేశ రాజధాని ఢిల్లీలో ఎంసీబీలో జరిగిన దీపావళి వేడుకల కార్యక్రమంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తన బృందంతో కలిసి అద్భుతమైన డాన్స్ ను ప్రదర్శించాడు.

దీపావళి పండుగ సందర్భంగా ఎయిర్కిటెక్ పండుగలు జరుపుకోవడమే కాకుండా.భారతీయ సంగీతం, నృత్యాన్ని చేయడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

అమెరికా ఎంబసీలో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నట్లు మనం వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎరిక్ గార్సెట్టి తన బృందంతోపాటు హిందీ పాట ” తౌబా తౌబా “( Tauba Tauba Song ) పాటకు డాన్స్ చేసి అందులో ఆకట్టుకున్నాడు.ఇతడి డాన్స్ చూడగానే అక్కడ ఉన్నవారు అందరూ కూడా చప్పట్లు కొడుతూ అతనికి ఉత్సాహాన్ని అందచేశారు.ఎరిక్ గార్సెట్టి కూడా తన అద్భుతమైన డాన్స్ తో అందరినీ ఆకట్టుకోవడం.

అలాగే అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ కనబడుచాడు.ప్రస్తుతం ఈ డాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఈ క్రమంలో ఎరిక్ గార్సెట్టి నృత్యం, భారతీయ సంస్కృతి పట్ల అతడికి ఎంతటి గౌరవం ఉందన్న విషయమే కాకుండా.భారతదేశంలో ఎంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది.ఈ వీడియో విభిన్న సంస్కృతుల మధ్య కమ్యూనికేషన్, అవగాహన ఎంత ముఖ్యమైనదో అన్నట్టుగా అందరికీ కనపడుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ స్వీట్స్, రంగోలి దీపాలను వెలిగించడం లాంటి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

మీరు కూడా ఈ ఎరిక్ గార్సెట్టి డాన్స్ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.ఈ వేడుకలలో భాగంగా అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు ఉన్నతాధికారులతో పాటు 600కు మంది పైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube