టాలీవుడ్ ఇండస్ట్రీలో చలపతిరావుకు( Chalapathi rao ) ఎంత మంచి పేరు ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.ఈయన రేప్ సన్నివేశాలు ఎక్కువగా నటించేవారు.
తర్వాత చాలా ఫన్నీ క్యారెక్టర్స్ వేసి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు.మొత్తం 600కు పైగా సినిమాల్లో నటించాడు.2022లో 78 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ కారణంగా మరణించారు అయితే బతికున్న సమయంలో తన ఫ్యామిలీ స్టోరీ గురించి చెప్పే చాలామంది కంటతడి పెట్టించారు. రవి బాబు( Ravi Babu ) తో పాటు ఇతనికి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
తల్లి చనిపోయాక వారిని పెంచలేక తాను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
“నేను ఇంటర్ చదివే రోజుల్లో మా ఆవిడ కూడా ఇంటర్ చదివేది.మేమిద్దరం కాలేజ్ మేట్స్.అక్కడే ప్రేమించుకుందాం.మామూలుగా ప్రేమించుకోలేదు.మా మధ్య స్వచ్ఛమైన ప్రేమ చిగురించింది.కాలేజీ రోజుల్లోనే పెళ్లి చేసుకుందామనే ఒక నిర్ణయానికి వచ్చాము.ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె.
అప్పటికి మా పెద్దన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు.పెద్దవాడికి పెళ్లి కాకుండా అప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అని ఇంట్లో అడిగారు.అమ్మాయి తొందరపెట్టింది.దీంతో కాలేజీలోనే ఫ్రెండ్స్ మధ్య మేమిద్దరం పెళ్లి చేసుకుందాం.కాపురం కూడా పెట్టేసాం.దీని గురించి మా తల్లిదండ్రులకు తెలియదు.
తర్వాత చెన్నై ( Chennai )వెళ్లిపోయాం.పిల్లల్ని కన్నాం.
చెన్నైలో ఉన్నప్పుడు రవికి ఆరేళ్లు, మిగతా పిల్లలకు 4, 2 ఏళ్లు ఉన్నాయి.వాళ్లు చాలా పసిపిల్లలు.
ఆ సమయంలోనే మా ఆవిడ చనిపోయింది.ఆవిడ అంతక్రియలు మద్రాసులోనే జరిపించాం.” అని చలపతి రావు చెప్పుకొచ్చాడు.
“రెండేళ్ల వరకు ఏం చేయాలో తెలియలేదు.అప్పటికీ చిన్న పిల్లలు వాళ్లు.నా దగ్గర పడుకునేవారు.
మా దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు.తెచ్చుకున్న రూ.1 లక్ష మనీ మొత్తం ఖర్చు అయింది.మరోవైపు రెండో పెళ్లి చేసుకోమని, లేదంటే పిల్లలను దత్తతకు ఇవ్వమని సజెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు.
కానీ నేను పెళ్లి చేసుకుని రెండో కాపురం పెట్టదలుచుకోలేదు.వచ్చే ఆమె ఈ పిల్లలని సరిగా చూసుకుంటుందో లేదో అని చాలా భయపడిపోయాను.
పిల్లలను గొప్పగా చదివించాలి అనుకున్నాను.అందుకే మా అమ్మకు ఫోన్ చేసి పిల్లల్ని చూసుకుంటావా అని అడిగాను.
వెంటనే ఆమె “ఎందుకు చూసుకోను, రా” అని చెప్పింది.ఆమెను ట్రైన్ ఎక్కించి చెన్నైకి తీసుకొచ్చాను.
మా అమ్మే ఆ పిల్లల్ని పెంచింది.అప్పటికే మా అమ్మ ఓల్డ్ ఏజ్ లోనే ఉన్నారు అయినా సరే ఓపిక పిల్లలను పెంచి పెద్ద చేశారు.” అని చలపతిరావు వెల్లడించాడు.”పిల్లలను పెంచే క్రమంలో చనిపోవాలని థాట్ కూడా వచ్చింది.కానీ రోడ్ల వెంట తిరుగుతూ అడుక్కునే ఏం చేరుకోవచ్చు ఆ మాట కూడదని భావించా అందుకే వారిని పెంచి పెద్ద చేశాక.వారి కాళ్ళ మీద వాళ్లని నిలబెట్టా.” అని చలపతిరావు ఇంటర్వ్యూని ముగించాడు.