ఏపీ గవర్నర్ కి లేఖ రాసిన చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా సంతోషంగా ఉన్నారు.కారణం నిన్న ఏపీలో జరిగిన పోలింగ్ 80% దాటడంతో కచ్చితంగా కూటమికి సానుకూలమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోకుండా ఎక్కడికి అక్కడ జాగ్రత్తలు పడటం జరిగింది.2014లో మాదిరిగా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో.

 Chandrababu Wrote A Letter To Ap Governor Chandrababu , Ap Governor , Telugu De-TeluguStop.com

చాలా హోంవర్క్ చేసి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదయినట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో కచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే జనాలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు అని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే మంగళవారం చంద్రబాబు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కి లేఖ రాశారు.జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో చేసే బిల్లుల చెల్లింపులను ఆపాలని ఆ లేఖలో కోరారు.బినామీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేందుకు సీఎం జగన్( CM Jagan) సిద్ధమయ్యారని పేర్కొన్నారు.

లబ్ధిదారులకు రావాల్సిన నిధులు బినామీ కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఆరోపించారు.ఇలా జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube