తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్( Tamilisai Sounder Rajan ) కీలక వ్యాఖ్యలు చేశారు.వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని తెలిపారు.
తెలంగాణలో మెజార్టీ స్థానాలు అన్నింటినీ గెలుస్తున్నామని తమిళిసై ధీమా వ్యక్తం చేశారు.ఫలితాల తరువాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్రమంత్రులుగా ఉంటారని చెప్పారు.
సౌత్ చెన్నైలోనై( South Chennai ) హోరాహోరీ పోటీ ఉందన్న ఆమె గెలిచి తీరుతానని స్పష్టం చేశారు.అదేవిధంగా ప్రచారం జరుగుతున్నట్లు రిజర్వేషన్లను తీసివేసే ప్రసక్తే లేదని తెలిపారు.
కొందరు కావాలనే బీజేపీపై( BJP ) తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆమె దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందని వెల్లడించారు.