కిర్గిజ్‌స్థాన్‌లో తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డారు.వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన దాసరి చందు( Dasari Chandu ) అనే యువకుడు మంచు జలపాత సందర్శనకు వెళ్లి మరణించాడు.
మృతుడు చందు ఏపీలోని అనకాపల్లి( Anakapalle district ) జిల్లా మాడుగుల మండలం మాడుగుల గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు.ఏడాది కిందట చందు ఎంబీబీఎస్( MBBS ) విద్యను చదివేందుకు కిర్గిజ్‌స్థాన్ వెళ్లాడని తెలుస్తోంది.
తాజాగా పరీక్షలు ముగియడంతో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను మంచు జలపాతం సందర్శనకు తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు సరదాగా మంచు జలపాతంలోకి దిగారు.వీరిలో చందు మంచులో ఇరుక్కుని పోవడంతో మృత్యువాత పడ్డారు.కాగా చందు మృతదేహాన్ని స్వస్థలం తీసుకువచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.