గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం( Mangalagiri Assembly constituency )లో టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా తుమ్మపూడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే విదేశీ విద్యకు జగన్ పేరును మారుస్తామని లోకేశ్ తెలిపారు.అలాగే ప్రజల ఆశీర్వాదంతో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
గతంలో రూ.200 ఉన్న పెన్షన్ ను చంద్రబాబు రూ.2 వేలు చేశారన్న లోకేవ్ చంద్రన్న బీమా, పెళ్లికానుక, విదేశీ విద్య వంటి పలు పథకాలను తీసుకొచ్చారు.అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాము తెచ్చిన పథకాలన్నింటినీ రద్దు చేశారని మండిపడ్డారు.అలాగే కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ను రద్దు చేస్తామంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.117 జీవో రద్దు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని వెల్లడించారు.అదేవిధంగా అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని లోకేశ్ తెలిపారు.