పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ( Janasena Party ) తరఫున జబర్దస్త్ టీం స్టార్ క్యాంపెనర్లుగా మారి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా జనసేన ప్రచారకర్తలుగా ఉన్న వారిలో హైపర్ ఆది( Hyper Aadi ) ఒకరు.
ఈయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అవ్వడమే కాకుండా పలు సందర్భాలలో జనసేన పార్టీ తరపున మాట్లాడుతూ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.ఈ విధంగా హైపర్ ఆది తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీ అయ్యారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా హైపర్ ఆది పిఠాపురంలో( Pithapuram ) ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.
![Telugu Hyper Aadi, Hyperaadi, Janasena, Pawan Kalyan, Pitapuram-Movie Telugu Hyper Aadi, Hyperaadi, Janasena, Pawan Kalyan, Pitapuram-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Hyper-aadi-participate-election-campaign-at-pitapuram-detailss.jpg)
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పిఠాపురంలో పర్యటించిన ఆది అధికార పార్టీ పై విమర్శలు చేశారు.ప్రచార కార్యక్రమాలలో భాగంగా తాము పిఠాపురం వచ్చానని అయితే ఇక్కడ ఎవరిని అడిగిన మా ఓటు పవన్ కళ్యాణ్ గారికే అంటూ చెబుతున్నారు.ఇక ఎన్నికలు జరగకుండానే పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలిపారు.
పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపారు.పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత పిఠాపురం రూపు రేఖలు మారిపోతాయని తెలిపారు.
![Telugu Hyper Aadi, Hyperaadi, Janasena, Pawan Kalyan, Pitapuram-Movie Telugu Hyper Aadi, Hyperaadi, Janasena, Pawan Kalyan, Pitapuram-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Hyper-aadi-participate-election-campaign-at-pitapuram-detailsd.jpg)
ఇప్పుడు మనం హైదరాబాద్ చూడటానికి ఎలా వెళ్తున్నామో రేపు పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత కూడా ఇక్కడ అభివృద్ధి చూసి పిఠాపురం చూడటానికి వస్తారని ఆది తెలిపారు.జనసేన మొదటి విజయం పిఠాపురం నుంచి మొదలవుతుందని తెలిపారు.ఇక మిగిలిన జనసేన అన్ని నియోజక వర్గాలలో పర్యటించి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ఆది తెలిపారు.ఇక వారి షూటింగ్స్ గురించి మాట్లాడుతూ.నెల రోజుల పాటు ఎలాంటి షూటింగ్స్ కి వెళ్ళమని, ఎన్నికల తరువాతనే షూటింగ్స్ జరుగుతాయని ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
.