తైవాన్( Taiwan )లో భారీ భూకంపం చోటు చేసుకుంది.రాజధాని తైపీ( Taipei )లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదు అయినట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
తైవాన్ లో హువాలియన్( Hualian ) నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో 34.8 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.అయితే గత 25 ఏళ్లల్లో ఇదే భారీ భూకంపమని అధికారులు వెల్లడిస్తున్నారు.