ఇటీవల, అమెరికాలోని రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలకు చెందిన కొంతమంది సెనేటర్లు ఒక వింతైన విషయం గురించి గొప్ప చర్చ జరిపారు.ఆ విషయం ఏంటంటే… బంగాళాదుంపను ( potato )కూరగాయల నుండి ధాన్యాల జాబితాలోకి మార్చాలా వద్దా అనేది! అవును, మీరు విన్నది నిజమే – బంగాళాదుంపల గురించి అమెరికా రాజధానిలో చాలా చర్చ జరిగింది.
అదేదో పెద్ద ప్రపంచ సమస్య అన్నట్లు.
ఈ చర్చ 2025 నుండి 2030 వరకు అమెరికన్లకు( Americans ) ఆహార సలహాలు ఇచ్చే “ఆహార మార్గదర్శకాలు”( Dietary Guidelines ) (DGAs) అనే పుస్తకం గురించి జరిగింది.ఈ పుస్తకంలో బంగాళాదుంపలను కూరగాయల జాబితాలో ఉంచాలా లేదా ధాన్యాల జాబితాలో ఉంచాలా అనేది ఒక ముఖ్యమైన అంశం.కొంతమంది సెనేటర్లు బంగాళాదుంప ఒక కూరగాయ అని, దానిని కూరగాయల జాబితాలోనే ఉంచాలని వాదించారు.
బంగాళాదుంప ఎందుకు కూరగాయ జాబితాలోనే ఉంచాలి అనేది తెలుసుకుంటే, బంగాళాదుంపలలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ B6 మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.USDA ప్రారంభమైనప్పటి నుంచి బంగాళాదుంపలను కూరగాయలుగా పరిగణించారు.2013 అధ్యయనం ప్రకారం తెల్ల బంగాళాదుంపలు కూరగాయల సమూహంలో భాగం కావాలి.బంగాళాదుంప ఎందుకు ధాన్యం కావచ్చు? అని అడిగితే కొందరు పిండి కూరగాయలను (బంగాళాదుంపలు వంటివి) ధాన్యాలతో మార్చుకోవచ్చని భావిస్తారు.బంగాళాదుంపలను ధాన్యాలుగా లేబుల్ చేయడం వల్ల పాఠశాలలకు శాఖాహార సిఫార్సులను అందించడం సులభం అవుతుంది.మరి ఈ చర్చ ప్రభావం ఏమిటి? ఈ చర్చ కారణంగా వినియోగదారులు గందరగోళానికి గురవుతారు.మొత్తం ఆహార సరఫరా గొలుసుకు అంతరాయం కలిగిస్తుంది.దుకాణదారులకు స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం అవుతాయి.