ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) లో భాగంగా వైజాగ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్( Chennai Super Kings, Delhi Capitals ) మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది.
ఈ మ్యాచ్ లో విశేషమేమిటంటే గురు శిష్యులు ఇద్దరు మంచి ఫామ్ లోకి వచ్చారు.రిషబ్ పంత్( Rishabh Panth ) అర్థ సెంచరీ తో అదరగొట్టగా, మిస్టర్ కూల్ ధోని చివర్లో వచ్చి తన మెరుపు ఇన్నింగ్స్ తో 16 బంతుల్లో నాలుగు సిక్సర్లు ,మూడు బౌండరీలతో 37 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో మరొక హైలెట్ ఏంటంటే వార్నర్ కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి పతిరానా అద్భుతమైన క్యాచ్ పట్టాడు.పతిరానా ఫీల్డింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోను, నాలుగు ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై ఖలీల్ వేసిన తొలి ఓవర్ లోనే చివరి బంతికి గైక్వాడ్ ఔట్ అయ్యాడు.ఖలీల్ అద్భుతమైన స్వింగ్ లతో రచిన్ రవీంద్రని కూడా పవర్ ప్లే లోనే అవుట్ చేసి చెన్నైని కోలుకోవాలని దెబ్బ కొట్టాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రహానే, మిచెల్ అద్భుతంగా ఆడారు.
ముఖేష్ కుమార్ ( Mukesh Kumar )అద్భుతంగా బౌలింగ్ చేసి మిచెల్ ను అవుట్ చేసి వీరిద్దరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు.ముఖేష్ కుమార్ మూడు కీలక వికెట్లు పడగొట్టి చెన్నై గెలుస్తుంది అన్న దశ నుంచి మ్యాచ్ ను ఒకసారి గా ఢిల్లీ వైపు టర్న్ చేసాడు.17వ ఓవర్ లో బ్యాటింగ్ కి వచ్చిన ధోని మెరుపులు మెరూపించిన ఫలితం లేకుండా పోయింది.ధోని ఇంకా కొంచెం ముందు బ్యాటింగ్ కి వచ్చి ఉంటే చెన్నై ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉండేవి.ఈ మ్యాచ్ చెన్నై ఓడినప్పటికీ మహేంద్రుడు విశాఖపట్నంలోని అభిమానులను గెలిచాడు.
ఈ మ్యాచ్ లో గెలుపుతో ఢిల్లీ తమ ఖాతాను తెరిచింది.నిజానికి ధోని కనక ఒక ఓవర్ ముందు క్రీజ్ లోకి వచ్చి ఉంటే ఈ మ్యాచ్ చెన్నై గెలిచేది.