అరియానా గ్లోరీ ( Ariyana Glory ) పరిచయం అవసరం లేని పేరు.ఈమె కెరియర్ మొదట్లో యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండేవారు.
ఇలా కెరియర్ మొదట్లో యాంకర్ గా ఉన్నటువంటి ఈమె అనంతరం డైరెక్టర్ రాంగోపాల్ వర్మ( Director Ram Gopal Varma )ను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఇకపోతే ఇంటర్వ్యూ ఈమెకు మరింత పేరు ప్రఖ్యాతలను కూడా తీసుకువచ్చిందని చెప్పాలి.
ఇలా ఈ ఇంటర్వ్యూ తర్వాత రెండు సార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె మరి ఇంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే ప్రస్తుతం కెరియర్ పరంగా పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.
![Telugu Ariyana, Ariyana Latest, Latest, Trolls-Movie Telugu Ariyana, Ariyana Latest, Latest, Trolls-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Trolls-on-Anchor-Ariyana-Glory-Photos.jpg)
ఒకప్పుడు సన్నజాజి తీగల ఎంతో సన్నగా ఉండే అరియనా ఇటీవల కాలంలో కాస్త ఒళ్ళు చేసిందని చెప్పాలి.ఈ క్రమంలోనే ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో( Glamor Show ) చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఇకపోతే పొట్టి పొట్టి దుస్తులు ధరించి అందాలను ఆరబోసే ఈమె ఇటీవల చీర కట్టుకొని ఎంతో పద్ధతిగా కనిపించారు.ఇక ఈ చీర కట్టులో విభిన్న రీతిలో ఫోటోలకు ఫోజులిస్తూ ఉన్నారు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
![Telugu Ariyana, Ariyana Latest, Latest, Trolls-Movie Telugu Ariyana, Ariyana Latest, Latest, Trolls-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/Netizens-Comments-on-Bigg-Boss-Fame-Ariyana-Glory-Latest-Photos-in-Saree.jpg)
ఇక ఈ ఫోటోలపై నేటిజన్స్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.చాలామంది ఈమె అధిక శరీర బరువు( Overweight ) ఉండటంతో కాస్త బరువు తగ్గొచ్చుగా అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు అసలు మీరేంటి ఇలా మారిపోయారు అంటూ కామెంట్ చేస్తున్నారు.మరి కొందరు మాత్రం దారుణమైనటువంటి కామెంట్లు చేస్తూ ఈమెను ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం అరియానా షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.