తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన సాధించిన విజయాలు గాని ఆయన తెలుగు సినిమా స్థాయి ని ప్రపంచానికి పరిచయం చేసిన తీరుగాని చూస్తే మనకు అర్థమైపోతుంది.
ఆయన ఏంటి అనేది ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగులో వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని రాముడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా, కర్ణుడిగా తనదైన రీతిలో విపరీతమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక మొత్తానికైతే తెలుగు సినిమాలా స్థాయిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాల వల్ల తెలుగు సినిమా స్థాయి అనేది సౌత్ సినిమాలన్నింటి కంటే ముందంజలోకి వెళ్లిందనే చెప్పాలి.ఇంకా ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో పోటీ పడాలని తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంజీఆర్( MGR ) ప్రయత్నం చేశారనే వార్తలు అప్పట్లో చాలా వరకు వినిపించాయి.
ఇక ఎన్టీయార్ తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఎంజీఆర్ కు నచ్చలేదు.ఎందుకంటే సౌత్ లో తమిళ్ సినిమా ఇండస్ట్రీ( Tamil Cinema Industry ) మాత్రమే టాప్ లో ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి మన ఎదుగుదలని ఓర్చుకోలేకపోయాడు.
ఇక దానివల్లే ఎంజీఆర్ ఎన్టీఆర్ తో పోటీపడ్డాడు అయినప్పటికీ ఎన్టీఆర్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు.ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇద్దామని ప్రయత్నం చేసినా కూడా ఎంజీఆర్ ఇండైరెక్ట్ గా అడ్డుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ వేసిన బాటలోనే తెలుగు సినిమా స్థాయి అనేది ప్రస్తుతం ప్రపంచంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి…
.