గంజాయి లాంటి మత్తు పదార్థాలు( Drugs ) మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయని,ముఖ్యంగా యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్ ను పాడు చేసుకోవద్దని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు( Huzurnagar CI Charamandaraju ) అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో గంజాయి మత్తుకు అలవాటుపడిన వారికి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలు అంతా ఇంతా కాదని,కుటుంబాలను నిర్వీర్యం చేస్తాయన్నారు.గంజాయికి అలవాటుపడిన పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎల్లపుడూ నిఘా ఉంచాలని,పిల్లలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ,ఉన్నత ఆలోచన పట్ల పిల్లలను ప్రోత్సహించాలని కోరారు.
మహిళల పట్ల సోదరి భావం పెంపొందించేలా చూడాలని కోరారు.పిల్లలు ఇలాంటి వ్యాపకాలను వదిలేసి సమాజానికి, పేరెంట్స్ కు మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సర్కిల్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.