ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి మారిపోతోంది.2024 ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ( TDP ) ఈ ఎన్నికలకు ఎన్నడూ లేని విధంగా సిద్ధమవుతోంది.ఇదే విషయాన్ని ఇటీవల మొదటి జాబితా విడుదల చేసిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తెలియజేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విభజన జరిగిన అనంతరం 2019 వరకు జరిగిన ఏ ఎన్నికలలో ఎన్నడూ చేయలేని కసరత్తు 2024 ఎన్నికలకు చేసినట్లు స్పష్టం చేశారు.చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో చాలామంది సీనియర్లకు చోటు దక్కలేదు.
ఈ పరిణామం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమాకి( Devineni Uma ) కూడా చోటు దక్కలేదు.దీంతో ఆయన పార్టీ మారబోతున్నట్లు తరకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి.ఈ క్రమంలో ఆదివారం ఉండవల్లిలో( Undavalli ) చంద్రబాబుతో దేవినేని ఉమా భేటీ అయ్యారు.
ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాటే శిరోధార్యమని ఉమా స్పష్టం చేశారు.
తాను చంద్రబాబుకి కుటుంబ సభ్యుడి లాంటి వాడినని చెప్పుకొచ్చారు.కాగా ఈసారి దేవినేని ఉమా నియోజకవర్గం మారుస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ త్వరలో టీడీపీలో జాయిన్ కాబోతున్నట్లు దాదాపు ఖరారు అయిపోయింది.దీంతో మైలవరం సీటు వసంతకు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి.