Nepotism : ఇండస్ట్రీ లో స్టార్ హీరో అవ్వాలంటే బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉండాలా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటూ ఎవరికి వాళ్లు సెపరేట్ జనార్స్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు.దాంట్లో కొంతమంది హీరోలు అన్ని తరహా పాత్రలను పోషిస్తూ, ముందుకు వెళ్తుంటే మరికొందరు మాత్రం కొన్ని జానర్స్ కి మాత్రమే పరిమితమైపోయి వాటిలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.నిజానికి ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ కూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో స్టార్ హీరోలుగా మారిన వాళ్లే కావడం విశేషం…

 Nepotism In Film Industry-TeluguStop.com
Telugu Chiranjeevi, Background, Nani, Nepotism, Tier Heroes-Movie

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేని ఏ ఒక్క హీరో కూడా స్టార్ హీరోగా లేడు.నిజానికి విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.అయినప్పటికీ తను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.దానికి కారణం అర్జున్ రెడీ తర్వాత ఆయనకి సరైన సక్సెస్ లు రాలేదు.అదే ఒక స్టార్ హీరో కొడుకుకు గాని అర్జున్ రెడ్డి లాంటి సక్సెస్ పడినట్లయితే వెంటనే ఆయన స్టార్ హీరో అయిపోయేవాడు.ఎందుకంటే ఆ వచ్చిన స్టార్ డమ్ ను కాపాడుకోవటానికి స్టార్ డైరెక్టర్లతో కాంబినేషన్స్ సెట్ చేసి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లేవారు.

కాబట్టి ఇండస్ట్రీలో ‘ నేపోటిజం’ ఉందా.? అంటే హీరోలను స్టార్ హీరోలుగా మార్చడానికి నేపోటిజం అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది.

 Nepotism In Film Industry-Nepotism : ఇండస్ట్రీ లో స్�-TeluguStop.com
Telugu Chiranjeevi, Background, Nani, Nepotism, Tier Heroes-Movie

కానీ యాక్టింగ్ రాకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళను హీరోలుగా నిలబెట్టడానికి మాత్రం నేపోటిజం అస్సలు హెల్ప్ అవ్వదనే విషయం మాత్రం చాలా క్లారిటీగా తెలుస్తుంది.కానీ ఎంతైనా ఇండస్ట్రీలో కొంత సపోర్ట్ ఉన్నది వేరేలా ఉంటుంది, ఏ సపోర్ట్ లేకుండా పైకి రావడం అనేది మరో రకంగా ఉంటుంది.ఒకప్పుడు చిరంజీవి, రవితేజ లాంటి ఏ సపోర్ట్ లేకున్నా స్టార్ హీరోలు గా ఎదిగారు.కానీ ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ‘టైర్ టు’ హీరో లు గానే మిగిలిపోయారు తప్ప స్టార్ హీరో రేంజ్ కి రావడం లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube