మాధకద్రవ్యాల నిర్మూలన పైన "యాంటీ డ్రగ్స్ క్లబ్స్" ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: మాధకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఆధ్వర్యంలో చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.

 Painting Competition On Eradication Of Drugs Under Anti Drugs Club Sp Akhil Maha-TeluguStop.com

జిలాల్లో మాధకద్రవ్యాల నిర్ములనకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా జిల్లాలో విద్యార్థినీ, విద్యార్థులతో గత సంవత్సరం “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలతో పాటుగా, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు.

జిల్లా స్థాయిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” లో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు మాధకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు, అవగాహనపై తేదీ :19-01-2024 (శుక్రవారం) రోజున చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు ఆయా మండల కేంద్రాల్లో సంబంధిత ఎస్.ఐ ల ఆధ్వర్యంలో నిర్వహించబడును.ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి వారికి జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు, బహమతులు ప్రధానం చేయడం జరుగుతుంది.ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులను 03 కేటగిరీలుగా విభజించడం జరిగింది.

1.2 టూ 5త్ క్లాస్
2.6త్ to 10త్ క్లాస్
3.ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ

కావున పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ పై పోటీలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థినీ, విద్యార్థులకు తెలియజేసి పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి గల విద్యార్థినీ, విద్యార్థులను పోటీల్లో పాల్గొనడానికి భాగస్వామ్యం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube