సాధారణంగా కొందరి కళ్లు ఎంతో కాంతివంతంగా, మిలమిలా మెరిస్తూ ఎట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి.అలాంటి కళ్లంటే అందరూ ఇష్టపడతారు.
ఆ కళ్లను చూసే కొందరు ప్రేమలో కూడా పడతారు.అయితే కొందరి కళ్లు మాత్రం నిగారింపు లేకుండా ఎప్పుడూ అలసిపోయినట్టే, ఎర్రగా భయకరంగా కనిపిస్తాయి.
ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, మద్యపానం, ధూమపానం, పోషకాల లోపం, కప్యూటర్ల ముందు ఎక్కువ సమయం పాటు గడపడం ఇలా రకరకాల కారణాల వల్ల కళ్లలో కాంతి తగ్గుతుంది.
అయితే ఈ సమస్యను నివారించుకునేందుకు ఖచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.కళ్లను తెల్లగా, కాంతివంతంగా మరియు ఆరోగ్యవంతంగా మార్చడంలో నట్స్ అద్భుతంగా సహాయపడతాయి.
అందువల్ల.ప్రతి రోజు జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పిస్తా వంటి నట్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.
అలాగే పాలకూర కూడా కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.పాలకూరలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది.మరియు కళ్లను యవ్వనంగా మెరిసేలా చేస్తుంది.కాబట్టి, వారంలో కనీసం రెండు సార్లు అయినా పాలకూరను తీసుకోవాలి.కళ్ల ఆరోగ్యాన్ని, కాంతిని రెట్టింపు చేయడంలో చేపలు కూడా ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.చేపలను వారంలో ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే.
అందులో ఉండే విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు కళ్లకు ఎంతో మంచివి.
ఇక వీటితో పాటు ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి.
వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాలి.కంప్యూటర్ల మందు గంటల తరబడి కూర్చుని పని చేసే వారు.
మధ్య మధ్యలో కళ్లకు కాస్త రెస్ట్ ఇవ్వాలి.కళ్ల వ్యాయామాలు చేస్తుండాలి.
కళ్లు బాగా అలసిపోయాయని అనిపించినప్పుడు.గ్రీన్ టీ బ్యాగ్స్‌ను కళ్లపై పెట్టుకుంటే అలసట దూరం అవుతుంది.
.