గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ సినిమాలు సక్సెస్ అవ్వడం లేదు.ఆయన చేస్తున్న సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి.
దాంతో ఆయన మళ్లీ మళ్లీ లేచి సక్సెస్ ను దక్కించుకునే ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ వచ్చాడు.ఎట్టకేలకు ఈయన అఖండ సినిమాతో గట్టి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల చివర్లో విడుదల చేయాలని భావించారు.కాని అనూహ్యంగా సినిమా కు కరోనా దెబ్బ పడింది.
గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య సినిమా లకు రాని క్రేజ్ ఈ సినిమా కు వచ్చింది.పెద్ద ఎత్తున ఈ సినిమా వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా అనుకున్నారు.
ఇటీవలే వచ్చిన టీజర్ తో సినిమా రేంజ్ అమాంతం పెరిగింది.
బాలయ్య కెరీర్ లో ఇది వంద కోట్ల సినిమా గా నిలువబోతుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్న సమయంలో కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది.
సినిమా కు ఉన్న బజ్ తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే సినిమా పై ఉన్న అంచనాలతో దాదాపుగా 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజీనెస్ చేస్తుందని అంటున్నారు.సినిమా విడుదల వాయిదా పడటం వల్ల బిజినెస్ విషయంలో కూడా తేడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
కరోనా వల్ల మంచి బజ్ ఉన్న అఖండ సినిమా ఇలా అర్థాంతరంగా తగ్గి పోవడం తో ఏమాత్రం అంచనాలు లేకుండా అయ్యే ప్రమాదం ఉందంటూ టాక్ వినిపిస్తుంది.మొత్తానికి ఊపు మీద ఉన్న బాలయ్య ఇలా అర్థాంతరంగా కరోనా వల్ల అటు ఇటు కాకుండా అయ్యాడనే ఆవేదన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే అఖండ విడుదల చేసి ఉంటే వంద కోట్లు వసూళ్లు చేసేది.కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదేమో అంటున్నారు.