మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటీమార్.కబడ్డీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
సినిమాలో గోపీచంద్ కు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలోని జ్వాలారెడ్డి సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతుంది.
మార్చ్ 12న రిలీజైన ఈ సాంగ్ రీసెంట్ గా 10 మిలియన్ వ్యూస్ రాబట్టింది.తెలంగాణా ఫోక్ సాంగ్ గా వచ్చిన జ్వాలారెడ్డి పాటను కాసర్ల శ్యాం రచించారు.
ఇక ఈ పాటని శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు.సీటీమార్ సినిమాలోని జ్వాలారెడ్డి సాంగ్ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేసింది.కెరియర్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు సీటీమార్ పక్కా హిట్ అందించేలా ఉందని చెప్పొచ్చు.ఈ సినిమాతో పాటుగా గోపీచంద్ మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.
తేజ డైరక్షన్ లో అలివేలు మంగ వెంకటరమణ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.ఈ మూడు సినిమాలతో గోపీచంద్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.
సీటీమార్ సినిమా మీద మాత్రం గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.ఏప్రిల్ 2న రిలీజ్ అవాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డది.