చాలామందినీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది అధిక బరువు( overweight ) అని చెప్పవచ్చు.చాలామంది ఈ అధిక బరువు నుండి ఉపశమనం పొందడం కోసం ఎన్నో రకాల డైట్లు, వ్యాయామాలు( Exercise ) చేస్తూ ఉన్నారు.
ఎంత చేసినప్పటికీ కూడా బరువు తాత్కాలికంగా మాత్రమే తగ్గుతారు.కానీ మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు.
అయితే ఎక్కువ సేపు కూర్చొని పనిచేసిన వారికి నడుము చుట్టూ రింగులా కొవ్వు ఏర్పడుతుంది ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు కానీ ఆ తర్వాత మాత్రం బరువు పెరుగుతూ ఉంటుంది.దీనికోసం ప్రత్యేక టిప్స్ పాటించాలి.
అయితే ముఖ్యంగా అన్నం, రోటీలు, తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారం, లేదా కేవలం ఆకుకూరలు, కూరగాయలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తింటే శరీరంలో ఉన్న కొవ్వు తొందరగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆకుకూరలు, కూరగాయలలో కార్బోహైడ్రేట్స్( Carbohydrates ) చాలా తక్కువగా ఉంటాయి.శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి.కాబట్టి వాటిని మాత్రమే భోజనంలో భాగం చేసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది.
ఇలా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గి స్లిమ్ గా తయారవ్వాలి అనుకుంటున్న వారు మీ భోజనంలో ఇలాంటి పోషకాలు లభించే ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితాలు దక్కుతాయి.ఇక దీనిని కచ్చితంగా రెండు నుండి మూడు నెలల వరకు కఠినంగా ఫాలో అయితే ఆశించిన మేరకు మంచి ఫలితాలు లభిస్తాయి.
ఇక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శరీరంలో కార్టీసోల్ అనే హార్మోన్ ( Cortisol hormone )విడుదలవుతుంది.
ఇది పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.అందుకే ఒత్తిడిని కూడా వీలైనంత వరకు వదిలించుకోవాలి.ఒత్తిడి దూరం చేసుకోవడం కోసం కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపాలి.
అలాగే యోగా, ధ్యానం కూడా ఒత్తిడిని కొంతవరకు నివారిస్తాయి.అంతేకాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా శరీరానికి తీవ్ర హాని కలుగుతుంది.
దీంతో అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.కాబట్టి స్లిమ్ గా తయారవ్వాలి అనుకుంటున్న వారు మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది.
ఈ విధంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే రెండు మూడు నెలల్లో మీరు స్లిమ్ గా తయారవ్వవచ్చు.