సాధారణంగా పులులు( Tiger ) జనావాసాల్లోకి వస్తే ఎవరో ఒకరు పైన దాడి చేస్తాయి.లేదంటే జనాల అరుపులకు భయపడి చాలా ఆందోళనగా అక్కడి నుంచి ఉరుకులు, పరుగులు తీస్తుంటాయి.
కానీ ఒక పులి మాత్రం జనావాసాల్లోకి వచ్చి చాలా ప్రశాంతంగా పడుకుంది.వందల మంది దాని ముందు గుమ్మిగూడినా సరే అది హాయిగా కునుకు తీసింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ పులి ప్రవర్తన చూసి చాలామంది అవాక్కవుతున్నారు.
ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని ఫిలిబిత్ జిల్లాలో చోటు చేసుకుంది.డిసెంబర్ 25న ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు( Pilibhit Tiger Reserve )కు సమీపంలోని అత్‌కోనా ఊరిలో ఈ పెద్ద పులి అడుగుపెట్టింది.తర్వాత గ్రామంలోని ఒక కంపౌండ్ వాల్ ఎక్కి అక్కడే సుమారు 6 గంటల పాటు హాయిగా పడుకుంది.మంగళవారం తెల్లవారుజామున ఈ పులి గోడ పై కనిపించడం చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అది ప్రశాంతంగా పడుకోవడం చూసి మరి కొందరు ఆశ్చర్యపోయారు.దానివల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఉండాలని కొందరు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి వివరాలను అందించారు.
అధికారులు వచ్చి దానిని పట్టుకెళ్లేంతవరకు పులిని చూసేందుకు జనాలు కుప్పలు తిప్పలుగా అక్కడికి చేరుకున్నారు.వారందరూ పెద్ద ఎత్తున వస్తున్నా సరే పులి వారి వైపు కోపంగా కూడా చూడలేదు.అహింసకు ముగింపు పలికినట్లుగా అది చాలా శాంతంగా అలాగే గోడపై పడుకుంది.కొంతసేపటికి అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు కాంపౌండ్ వాల్‌కు కంచె సెటప్ చేశారు.ఆపై పులికి మత్తు మందు ఇచ్చి గ్రామం నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు.మరి దానిని సహజమైన ఆవాసాలకు తరలించారా? అనేది తెలియ రాలేదు.