సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 75వ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
అంతేకాదు ఈ మధ్య కాలంలో వెంకీ మామ సినిమాలకు ఎప్పుడు లేనంత హైప్ ఈ సినిమాకు క్రియేట్ అయ్యింది.వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”సైంధవ్”( Saindhav ).ఈ సినిమాతో వెంకటేష్ కూడా ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు.ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కు సిద్ధం చేసారు.పొంగల్ రేసులో వెంకీ రాబోతున్నాడు కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేసేసారు.ఇటీవలే షూట్ మొత్తం పూర్తి చేసుకోగా ఇప్పుడు వరుస ప్రమోషన్స్ తో సిద్ధం అయ్యారు.కాగా తాజాగా ఈ రోజు ఒక ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసారు మేకర్స్.
వెంకటేష్ నటుడిగా 75 సినిమాలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 5 గంటల నుండి ఈవెంట్ ను చేయనున్నారు.మరి ఈ ఈవెంట్ కోసం గెస్టులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.అంతేకాదు వెంకటేష్ 75 సినిమాలు చేసిన దర్శక నిర్మాతలు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది.చూడాలి ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ అవుతుందో.కాగా ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఒక వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ ( Shraddha Srinath ) నటిస్తుండగా.ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.