గడప గడపకు సాగిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా :తెలంగాణ రాష్ట్రంతో పాటు మన సిరిసిల్ల నియోజకవర్గం( Sircilla ) మరింత అభివృద్ధి జరగాలంటే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను గెలిపించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి.ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు.

 The Election Campaign Of The Brs Party Went On And On , Sircilla ,minister Ktr-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎనిమిది బూత్ లలో శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంచార్జీ లు పార్టీ శ్రేణులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ( Minister KTR )ను కారు గుర్తు కు ఓట్లు వేసి ఎంఎల్యే గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు ఎన్నికల ప్రచారం చేశారు.

సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకట్ రెడ్డి ల ఆద్వర్యంలో 7.8.9 ,10 వ వార్డుల లో విసృతంగా ఎన్నికల ప్రచారం చేశారు, ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ( BRS party )ఎన్నికల మేనిఫెస్టో 2023 ముదిరించిన కరపత్రాలను పార్టీ శ్రేణులు ఓటర్ల కు ఇచ్చి ఓట్లను అభ్యర్థించారు.ఈ ఎన్నికల ప్రచారం లో ఎ ఏం సి వైస్ ప్రెసిడెంట్ బంధారపు బాల్రెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి. ఎఎంసి డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ , వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మీనారాయణ , గడ్డమీద లావణ్య , మండల మహిళా అధ్యక్షురాలు అప్సరా , బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేవూరి పద్మా రెడ్డి, జగన్ రెడ్డి, ,నంది కిషన్ , గోషిక దేవదాస్, హాసన్ బాయి, ఒగ్గు లక్ష్మీ , గంట వెంకటేష్ గౌడ్ , నేవూరి నవజీవన్ రెడ్డి, శ్రీ నివాస్ గౌడ్, సుంకి భాస్కర్.

దొంతి రామకృష్ణ రెడ్డి , భాస్కర్ రెడ్డి, జవ్వాజి రామస్వామి, గడ్డం వెంకట్ , శ్యామ రాజు తదితరులు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని విసృతంగా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube