కోడింగ్ పోటీల్లో 67,000 మందిని ఓడించిన యువతి.. ఈ యువతి టాలెంట్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

పోటీ ప్రపంచంలో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప సక్సెస్ సాధించడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.దేశంలోని యువతలో ఎక్కువమంది గవర్నమెంట్ జాబ్, సాఫ్ట్ వేర్ జాబ్ పై ఫోకస్ పెడుతున్నారు.

 Muskan Agarwal Inspirational Success Story Details, Muskan Agarwal, Muskan Agarw-TeluguStop.com

సాఫ్ట్ వేర్ రంగంలో రాణించాలంటే కోడింగ్ లో( Coding ) ప్రతిభ చూపాలి.అయితే ఒక యువతి మాత్రం కోడింగ్ పోటీల్లో ఏకంగా 67,000 మందిని ఓడించి వార్తల్లో నిలిచారు.

ముస్కాన్ అగర్వాల్( Muskan Agarwal ) సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అని చెప్పకుండా ఉండలేము.

ఐఐఐటీ యునలో రికార్డ్ సృష్టించిన ముస్కాన్ అగర్వాల్ సంవత్సరానికి ఏకంగా 60 లక్షల రూపాయల ప్యాకేజ్ ను అందుకుంటున్నారు.

లింక్డిన్ లో( LinkedIn ) ఉద్యోగం సాధించిన ఈ యువతి బెంగళూరు లింక్డిన్ కేంద్రంగా పని చేస్తున్నారు.టెక్ గిగ్ గీక్ గాడెస్ 2022( TechGig Geek Goddess 2022 ) కోడింగ్ పోటీలలో 67,000 మంది మహిళా కోడర్లను ఓడించి ముస్కాన్ అగర్వాల్ పైచేయి సాధించారు.

దేశంలోని టాప్ ఉమెన్ కోడర్లలో ముస్కాన్ కూడా ఒకరిగా నిలిచారు.

నాలుగు గంటల పాటు కోడ్ లను రాసిన ముస్కాన్ అగర్వాల్ లక్షన్నర రూపాయల బహుమతిని సొంతం చేసుకున్నారు.లింక్డిన్ లో మెంటార్ షిప్ కు ఎంపికైన 40 మంది మహిళలలో ముస్కాన్ కూడా ఒకరు కావడం గమనార్హం.ప్రస్తుతం సోషల్ మీడియాలో ముస్కాన్ అగర్వాల్ పేరు హాట్ టాపిక్ అవుతోంది.

గత కొన్నేళ్లుగా కోడింగ్ ను నేర్చుకోవడం వల్లే ముస్కాన్ ఈ అరుదైన ఘనతను సాధించారు.

గర్ల్స్‌స్క్రిప్ట్ ఫౌండేషన్ లో కూడా ముస్కాన్ అగర్వాల్ భాగస్వామి కావడం గమనార్హం.ముస్కాన్ చదువుతున్న కాలేజ్ లో ఆమె సాధించిన ప్యాకేజ్ హైయెస్ట్ అని తెలుస్తోంది.ముస్కాన్ అగర్వాల్ టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్ కాకపోయినా ముస్కాన్ అగర్వాల్ తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకోవడాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

Muskan Agarwal Inspirational Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube