తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పోటీకి దిగనున్న సంగతి తెలిసిందే.అయితే రాష్ట్రంలో జనసేనకు పార్టీ గుర్తు కష్టమేనని తెలుస్తోంది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రాంతీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లేదు.ఈ క్రమంలో జనసేన నుంచి పోటీకి దిగనున్న అభ్యర్థులను ఈసీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గుర్తించే అవకాశం ఉందని సమాచారం.
అయితే తెలంగాణలో మొత్తం ఎనిమిది స్థానాల్లో జనసేన బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.అయితే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎనిమిది స్థానాలకు వేర్వేరు గుర్తులను కేటాయించే అవకాశం ఉంది.
కాగా ఇప్పటికే ఈసీ తెలంగాణలో గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టింది.







